భారత్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం అర్ధరాత్రి ముగిసిన మూడో టీ20లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 107 పరుగులు చేయడంతో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 20 పరుగులే చేయగలిగింది. ఆ టీమ్‌లో మార్కో జాన్సెన్ వరుస సిక్సర్లు బాది ఆఖర్లో కంగారు పెట్టినా.. టీమిండియా బౌలర్లు పట్టువదలకుండా క్రమశిక్షణతో బౌలింగ్ చేసి టీమ్‌కి విజయాన్ని అందించారు.హైదరాబాద్‌కి చెందిన 22 ఏళ్ల తిలక్ వర్మకి ఇదే కెరీర్‌లో ఫస్ట్ సెంచరీకాగా.. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. నాలుగు టీ20ల సిరీస్‌లో భారత్ తాజా విజయంతో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. దాంతో సిరీస్ కోల్పోయే ప్రమాదం కూడా తప్పినట్లే. ఇక లాస్ట్ టీ20 శుక్రవారం రాత్రి జరగనుంది.