దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ జట్టు పర్యటన శుక్రవారం రాత్రితో ముగిసింది. నాలుగు టీ20ల సిరీస్‌లో ఆఖరిదైన నాలుగో టీ20 మ్యాచ్‌లో.. 135 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా 3-1తో సిరీస్‌ని చేజిక్కించుకుంది.నాలుగో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 120 పరుగులు చేశాడు. మరో క్రికెటర్ సంజు శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో ఇద్దరికీ ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం.ఇద్దరూ రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు జోడించారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. తొలి టీ20లో సంజు శాంసన్, మూడో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే.