Current Date: 02 Apr, 2025

ఏపీలో పుష్ప-2 టికెట్ల ధర పెంపునకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. టికెట్ రేటు ఎంతంటే?

అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక జీవోను కూడా విడుదల చేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ టికెట్ల రేట్ల పెంపునకి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4 రాత్రి 9.30గంటలకు బెనిఫిట్ షోతోపాటు అర్థరాత్రి 1గంట షోకు కూడా పర్మిషన్ ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది.ఈ షో చూడాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా రూ. 800 ప్లస్ జీఎస్టీ కూడా చెల్లించాలి. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు డిసెంబర్ 5న ఆరు షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.

Share