Current Date: 27 Nov, 2024

బిరియానీలో సిగరెట్ పీక.. హైదరాబాద్‌ హోటల్‌లో రచ్చరచ్చ

హైదరాబాద్‌లో బిర్యానీ ఫేమస్. తోపుడు బండ్ల నుంచి ప్రముఖ హోటళ్ల వరకు మాంసాహార వంటకాలదే హవా. వీకెండ్ వచ్చిందంటే చాలు బయటకు వెళ్లి బిర్యానీ రుచి చూడటం సాధారణం. అలాంటి బిర్యానీ విషయంలో అనేక కల్తీ ఘటనలు జరుగుతుండడం భోజన ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బిర్యానీలో పురుగులు, బొద్దింకలు, జంతువుల అవశేషాలు రావడం చూశాం. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్‌కి వెళ్లిన వెళ్లిన కస్టమర్లకు షాకింగ్ అనుభవం ఎదురైంది. బిర్యాని ఆర్డర్ ఇచ్చిన వారికి అందులో సిగరెట్ పీక దర్శనమిచ్చింది. దీంతో అక్కడున్న వాళ్లను ప్రశ్నించగా.. మరో బిర్యాని ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్లు గొడవ పెట్టుకుని హోటల్‌లో రచ్చ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్స్, హోటల్స్‌లో నిత్యం ఇలాంటి ఘటనలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎక్స్‌పైరీ అయిపోయిన పదార్థాలను వాడటం, కుళ్లిపోయిన మాంసం వంటివి ఎన్నో సందర్భాల్లో వెలుగులోకొచ్చాయి.

Share