తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవి ఎవరికి దక్కబోతోంది? అని గత కొన్నిరోజుగా ఏపీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తొలుత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత ఒకరు రేసులో నిలవగా.. తాజాగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుఅనూహ్యరీతిలో తెరపైకి వచ్చారు.నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు నాయుడు.. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుమలకు సంబంధించి చాలా కఠినంగానే వ్యవహరించబోతున్నట్లు టీటీడీ ఈవోని తప్పించడం ద్వారా సంకేతాలిచ్చారు. ఇప్పటికే కొత్త ఈవోగాశ్యామలరావునునియమించారువిజయనగరం రాజకుటుంబం వారసుడైన అశోక్ గజపతి రాజకు ఈ పదవి కేటాయించేందుకు చంద్రబాబు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. వివాదరహితుడు, ధార్మిక కార్యక్రమాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఒకసారి ఎంపీగా గెలిచారు.