Current Date: 02 Jul, 2024

జూనియర్‌ ఎన్టీఆర్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపిన నారా లోకేష్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌కు టీడీపీ  జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదినం. లోకేశ్‌కు ఎన్టీఆర్‌ బావ వరుస అవుతాడు. ‘దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, మహేశ్‌ బాబు.. ఎన్టీఆర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ పోస్టులు పెట్టారు. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు.