'పెళ్లి సందD'తో టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, అనతికాలంలోనే వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. డ్యాన్సులు, గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న ఈ భామకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. కానీ, ఆ క్రేజ్ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కరిగిపోయింది. ఇటీవల ఆమె నటించిన 'రాబిన్‌హుడ్', 'మాస్ జాతర' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో పరిశ్రమలో ఆమెపై 'ఐరన్ లెగ్' అనే ముద్ర బలంగా పడిపోయింది. వరుస డిజాస్టర్లు ఎదురవ్వడంతో టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు శ్రీలీల వైపు చూడటానికి వెనుకాడుతున్నారు. పెద్ద హీరోల ప్రాజెక్టులు మాత్రమే కాదు, మిడ్ రేంజ్ సినిమాల్లో కూడా ఈ భామకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఫలితంగా, ఒకప్పుడు చేతినిండా సినిమాలతో రాత్రింబవళ్లు షూటింగ్‌లలో బిజీగా గడిపిన ఈ చిన్నదాని చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క కొత్త తెలుగు సినిమా కూడా లేని పరిస్థితి నెలకొంది. తెలుగులో మార్కెట్ పడిపోవడంతో శ్రీలీల తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇతర భాషా చిత్ర పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్టులను దక్కించుకునే పనిలో పడింది. హిందీ, తమిళ భాషల్లో వస్తున్న ఆఫర్లను ఓకే చేస్తూ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. టాలీవుడ్‌లో మళ్లీ సరైన హిట్ పడితే తప్ప ఈ అమ్మడికి ఇక్కడ రీ-ఎంట్రీ తేలిక కాదు.
Share