ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం ముగిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం రాత్రి ముగిసిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం రాత్రి క్వాలిఫయర్-2లో ఆడటం ద్వారా రాజస్థాన్ టీమ్ ఫైనల్‌కి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టీమ్‌లో కోహ్లీతో పాటు డుప్లెసిస్ ఫెయిలవగా.. మాక్స్‌వెల్ డకౌటవడం ఆర్సీబీని దారుణంగా దెబ్బతీసింది. అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ప్రతి ఏడాది ఈసారి కప్ నమ్‌దే అంటూ స్టార్ట్ చేసే బెంగళూరు.. చివరికి ఉసూరమనిపిస్తూ అభిమానుల్ని నిరాశపరుస్తుంది. మరీ ముఖ్యంగా.. విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.