ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుంది. ఓడిన జట్టుకి కూడా ఫైనల్‌కి చేరేందుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.
లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన కోల్‌కతా టీమ్ 9 మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో నిలిచింది. అలానే హైదరాబాద్ టీమ్ 8 మ్యాచ్‌ల్లో గెలిచి రెండో స్థానంలో ఉంది. దాంతో టేబుల్ టాపర్స్ మధ్య ఈరోజు రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో ఆడనుంది.
కోల్‌కతా, హైదరాబాద్ జట్ల బలాబలహీనతలు చూస్తే.. హైదరాబాద్ టీమ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విధ్వంసకరంగా హైదరాబాద్ చెలరేగిపోతోంది. ప్లేఆఫ్స్‌కి ఆశలు లేని దశ నుంచి సమష్టిగా రాణిస్తూ అనూహ్యంగా పుంజుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016లో ఆఖరిగా టోర్నీ విజేతగా నిలిచిన హైదరాబాద్‌కి ఇది లక్కీ ఛాన్స్.