హాలీవుడ్ నటి కమ్ సింగర్, డాన్సర్ జెన్నిఫర్ లోపెజ్ వివాహ బంధం మళ్లీ పెటాకులైంది. ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకుని విడిపోయిన జెన్నిఫర్.. తాజాగా తన నాలుగో భర్తకు విడాకులిచ్చింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని.. సరిగ్గా రెండో వివాహ వార్షికోత్సవం సమీపిస్తున్న వేళ.. బెన్తో విడాకులకు దరఖాస్తు చేసింది. 2022లో బ్యాట్ మేన్ సినిమాల్లో నటించిన జెన్ అఫ్లెక్తో ప్రేమలో పడింది జెన్నిఫర్. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అంబానీకి చెందిన ఓ భారీ భవంతిని, దాదాపు 500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఈ జంట. కానీ కాపురం మొదలుపెట్టిన కొన్ని నెలలకే ప్యాలెస్ నుంచి జెన్నిఫర్ లోపెజ్ బయటకొచ్చేసింది. తాజాగా 54 ఏళ్ల వయసులో విడాకులకు అప్లయ్ చేసింది. జెన్నిఫర్ వివాహ బంధం గురించి గత 20 ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 1997లో పెళ్లి చేసుకుంది లోపెజ్. ఏడాది తిరక్కుండానే అతడికి విడాకులిచ్చింది. 2001లో క్రిస్ జూడ్ ను పెళ్లాడింది. 2003లో అతడికి కూడా విడాకులిచ్చింది. 2004లో మార్క్ ఆంటోనీని వివాహమాడింది. అతడితో పదేళ్లు కాపురం చేసి, 2014లో విడాకులు తీసుకుంది. 2022లో బెన్ ను పెళ్లాడింది. రెండేళ్లు కూడా తిరక్కుండానే అతడికి కూడా విడాకులిస్తోంది.
Share