Current Date: 02 Jul, 2024

హీరోయిన్ కారు డిక్కీ గొడవ.. అవాక్కవుతున్న నెటిజన్లు

సినిమాల ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మ‌న యాక్ట‌ర్స్ రోజు రోజు కొత్త మ‌ర్గాల‌ను వెతుకుతూ ఎదో ర‌కంగా తాము న‌టిస్తోన్న సినిమాల‌ను జ‌నంలోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు. ఈక్ర‌మంలో వారు చేస్తోన్న ప‌నులు ఒక్కోసారి వారి సినిమాల‌కు మంచి హైప్‌ను తీసుకొస్తుండ‌గా కొన్నిసార్లు న‌వ్వుల పాలుచేయ‌డంతో పాటు తీవ్ర విమ‌ర్శ‌ల పాలు చేస్తోంది.గురువారం హీరోయిన్ నివేథా పేతురాజ్ కారు డిక్కీ తీసే క్ర‌మంలో పోలీసుల‌తో వాగ్వాదం ఘ‌ట‌న బాగా వైర‌ల్ అయింది. నివేథా కారు డిక్కీని ఓపెన్ చేయండిపోలీసులుఅడ‌గ్గా అది నా ప‌ర్స‌న‌ల్, ప‌రువుకు సంబంధించిన ప్రాబ్లం ఉంది నేను డిక్కీ తెర‌వ‌ను అంటూ అక్క‌డ ఉన్న పోలీసుల‌పై తిరగబడటం సోషల్ మీడియాలో బాగా వైరలైంది.కానీ.. అది ‘‘పరువు’’సినిమాకిసంబంధించిన ప్ర‌మోష‌న్ స్టంట్ అని తేలిపోయింది. ఆ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతో ఇదంతా ఇది అమ్మా పులిమాదిరిలాఅయింద‌ని,పోలీస్డిపార్ట్‌మెంట్‌పై జోకులు త‌ప్పుడు సంకేతాలు వ‌చ్చేలా చేస్తాయంటూ మండి ప‌డుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ పరువు వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవ‌నుంది. ఈ సిరీస్ నిమిత్త‌మే నివేథా గురువారం కారు, డిక్కీ ,ప‌రువు అంటూ పెద్ద డ్రామా చేయ‌డంతో.. అది కాస్త వైర‌ల్ అయింది.