Current Date: 02 Apr, 2025

17న విశాఖ జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులు

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఈ నెల 17న విశాఖ జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుండి ర్యాలీగా బయలుదేరుతారు. ఎన్‌ఏడీ, జాతీయ రహదారి మీదుగా మద్దిలపాలెం వైపుగా రానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోగాపురం వద్ద భోజన విరామం. 2.30 గంటలకు బయల్దేరి శ్రీకాకుళం ఆర్చి - డే అండ్‌ నైట్‌ కూడలి - 7 రోడ్లు జంక్షన్‌ మీదుగా జీటీ రోడ్‌ - సూర్యమహల్‌ జంక్షన్‌ - అరసవిల్లి జంక్షన్‌ మీదుగా ఎంపీ ఇంటి వరకు ర్యాలీ చేపట్టనున్నారు. సాయంత్రం 5.00  గంటలకు ఎంపీ కార్యాలయం నుండి సూర్యమహల్‌ జంక్షన్‌ - రామలక్ష్మణ్‌ జంక్షన్‌ - పెద్దపాడు - జాతీయరహదారి మీదుగా నిమ్మాడ చేరుకుంటారు.

Share