గ్లోబల్‌స్టార్ రాంచరణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ 16 తెరకెక్కనుంది. ఉత్తరాంధ్రాతో ముడిపడిన క్రీడా నేపథ్యపు కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో మొదలైంది. చరణ్ ఈ నెలాఖరు నుంచి కెమెరా ముందుకెళ్లే అవకాశాలున్నాయి. జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్థి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో చాలా ప్రత్యేకం కానుంది.. మట్టి లాంటి చిత్రమిదని ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని చరణ్ చెప్పారు.