Current Date: 26 Nov, 2024

శారదా పీఠం15 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి

శారదా పీఠంకు కేటాయించిన 15 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాదీనం చేసుకుని, ఆ భూమిని బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్ కు చెరో 5 ఎకరాలు కేటాయించాలని విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకటరావు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విదసం నేతృత్వంలో సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇంచార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ కి వారంతా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బూసి వెంకట్రావు మాట్లాడుతూ భీమునిపట్నం, కొత్తవలస గ్రామ సర్వే నంబర్ 102, 103 లలో 15 ఎకరాల స్థలాన్ని శారదా పీఠం స్వరూపానం దకు వైసిపి ప్రభుత్వం కారు చౌకగా కేటాయించిందన్నారు. ఈ భూమి మార్కెట్ విలువ ఎకరా 10 నుండి 15 కోట్లు ఉండగా, కేవలం ఎకరా 1 లక్ష చొప్పున 15 ఎకరాలను కేవలం 15 లక్షలకే ఒక స్వామికి కట్టబెట్టడం సరైంది కాదని తెలిపారు. 

Share