Current Date: 18 May, 2026

భగీరథ్కు 14 రోజుల రిమాండ్

పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్కు మేడ్చల్ మెజిస్ట్రేట్ ఈనెల 29 వరకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. అంతకుముందు పేట్ బషీరాబాద్ పీఎస్లో రెండున్నర గంటల పాటు అతడిని సిట్ అధికారులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు వివరాలు పరిశీలించి రిమాండ్ విధించారు. కాసేపట్లో భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.