Current Date: 27 Nov, 2024

14 ఏళ్ల తరువాత విముక్తి, విడుదలైన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్ల వనవాసం. కొన్నేళ్లు జైలు శిక్షయితే కొన్నేళ్లు రహస్య జీవితం, కొన్నేళ్లు ఆశ్రయం. బయటి ప్రపంచానికి దూరంగా 14 ఏళ్లు గడిపిన అతనికి ఎట్టకేలకు విముక్తి లభించింది. స్వేచ్ఛా జీవితంలో అడుగెట్టాడు. అతనే నమ్మలేని నిజాల్ని లీక్ చేసి అగ్రదేశాన్ని వణికించిన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే.వికీలీక్స్ పేరుతో సంచలన విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తూ జూలియన్ అసాంజే పేరు మార్మోగిపోయింది. ఈ క్రమంలో అమెరికా మిలట్రీ రహస్యాల్నిలీక్ చేసిన ఆరోపణలపై బ్రిటన్ జైలులో మగ్గిన జూలియన్ అసాంజే చివరికి నేరాన్ని అంగీకరించడంతో బయటి ప్రపంచంలోకి అడుగెట్టాడు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బ్రిటన్ జైలు నుంచి అమెరికా కోర్టుకు హాజరై అక్కడ్నించి ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాడు. 

Share