Current Date: 04 Jul, 2024

ముహుర్తం ఫిక్స్‌ జూన్‌ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 12న ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈనెల 9వ తేదీ సోమవారం నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు ప్రమాణం చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది. ఈనెల 7న మరోసారి ఎన్డీయే సమావేశం జరగనుంది. ఈ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కానున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆరోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. 9వ తేదీ సాయంత్రం కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.