దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ను తాను 6 నెలల్లో వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా తయారు చేస్తానని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. అర్జున్ బౌలింగ్‌పై టైమ్ వేస్ట్ చేసుకుంటున్నాడు. అతడిలో బౌలింగ్ కంటే బ్యాటింగ్ సామర్థ్యమే ఎక్కువ. నా దగ్గర ట్రైనింగ్‌కి వస్తే బెస్ట్ బ్యాటర్‌గా తీర్చిదిద్దుతానని ఆఫర్ ఇచ్చాడు. వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ నా దగ్గర 12 రోజులు శిక్షణ తీసుకుని రంజీ అరంగేట్రంలో అతడు సెంచరీ చేశాడు. ఎవరైనా గ్రహించారా? అని యోగరాజ్ సింగ్ ప్రశ్నించాడు. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ టీమ్‌లో ఉన్నాడు. కానీ.. ఆ టీమ్ మాత్రం అతడ్ని మ్యాచ్‌ల్లో ఆడించడం లేదు. ఐపీఎల్ 2025లో ఆటో డ్రైవర్ల కొడుకులు కూడా ఆడుతూ.. మెరుస్తున్నారు.. ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ.. సచిన్ కొడుకు మాత్రం ప్రేక్షకుడిలా మ్యాచ్ చూడటానికే పరిమితం అవుతున్నాడు. ఆల్‌రౌండర్‌గా ఎదగాలని ఆశించిన అర్జున్‌కి గత 10 ఏళ్లుగా నిరాశ తప్పడం లేదు.
Share