Current Date: 02 Apr, 2025

11న చంద్రబాబు అనకాపల్లి రాక

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ నెల 11న గురువారం ఉమ్మడి విశాఖ జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లిలో అధికారులతో మంగళవారం సమీక్షించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ కేవీ. మురళీకృష్ణ, ఏఎస్పీ విజయభాస్కర్‌, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు  చిన్నికృష్ణ, జయరాం, ఇతర అధికారులతోనూ అనిత సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కదలిక వచ్చిన నేపథ్యంలో, దీనికి సంబంధించి పోలవరం ఎడమ కాలువను ఎస్‌.రాయవరం మండలం దార్లపాడులో సీఎం పరిశీలించనున్నారు

Share