అమరన్ సినిమాలోని ఓ సీన్లో సాయిపల్లవి హీరో శివ కార్తికేయన్‌పై తన ఫోన్ నెంబర్‌ను పేపర్‌పై రాసి సిగ్గుపడుతూ విసురుతుంది. ఆ పేపర్ ఓపెన్ చేసిన శివ కార్తికేయన్ వెంటనే సాయి పల్లవికి ఫోన్ చేస్తాడు.కానీ. ఆ సీన్లో చూపించిన నెంబరు నిజంగానే సాయిపల్లవిది అనుకుంటున్న అభిమానులు.. ఫ్యాన్స్ ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆ ఫోన్ నెంబరు చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతున్న విగీశన్ది. అయితే.. సాయి పల్లవి నెంబరు అనుకుని. గత కొన్నిరోజులుగా అతనికి విపరీతంగా ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయట.వరుస ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందన్నాడు. తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకుగానూ అమరన్ టీమ్ రూ.1.1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై విజయవంతంగా థియేటర్లలో ఇప్పటికీ రన్ అవుతోంది. ఇప్పటికే రూ.300 కోట్ల వరకూ వసూల్లు రాబట్టంది.