Current Date: 04 Jul, 2024

ఎలుకలు పట్టే ఉద్యోగం.. జీతం నెలకి రూ.10 లక్షలు!


ఎలుకలను పట్టుకోవడం కూడా ఓ ఉద్యోగమేనా అని పెదవి విరచకండి. అది కూడా అక్కడ ఓ ఉద్యోగమే. ఇందుకు జీతం కింద లక్షల్లో చెల్లిస్తారు.  ప్రపంచ ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎలుకలు రెచ్చిపోతున్నాయి. దాంతో ఆ నగరంలో అధికారులు ఓ ర్యాట్ క్యాచర్‌ను నియమించుకుని.. అతడికి జీతం కింద ఏడాదికి రూ. 1.2 కోట్లు చెల్లిస్తున్నారు. సబ్‌‌వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా ఎలుకల మందలే కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల ఇది వార్తల్లోకి ఎక్కింది కూడా.

న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ‘ర్యాట్‌ క్యాచర్‌’ను నియమించారు. ఇందుకోసం ఓ నోటిఫికేషన్ విడుదల చేసి.. ‘డైరెక్టర్‌ ఆఫ్‌ రోడెంట్‌ మిటిగేషన్‌’ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. దాదాపు 1000 దరఖాస్తులు రాగా.. వారిలో కేథలిన్‌ కొరాడీ అనే మాజీ ఉపాధ్యాయురాల్ని చివరకూ ఎంపిక చేశారు. స్కూల్‌ టీచర్‌‌గా పనిచేసిన ఆమె.. ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై పరిశోధన చేశారు. దీంతో ఎలుకలను తగ్గించే బాధ్యతలను ఆమె భుజాన వేశారు.

ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు దొరక్కుండా డిస్పోజ్ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం, సబ్‌‌వేలలో ఎలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చూడటం ఆమె విధి. కానీ, విష పదార్థాలను పెట్టి ఎలుకలను చంపకూడదని షరతు విధించారు. ఎందుకంటే గతంలో ఆలా చేయడం వల్ల చనిపోయిన ఆ ఎలుకలను తిని ఇతర జంతువులు, పక్షులు మృత్యువాతపడ్డాయి. అందుకే ఆ కండీషన్