ఒడిశాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సుందర్‌గఢ్ జిల్లాలో పార్టీ సభ్యత్వ డ్రైవ్ జరుగుతుండగా ఓ గిరిజన మహిళ రూ.100 తీసుకొచ్చి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాలంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండాకి అందజేసింది. ‘ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు తెలియజేయండి’ అని ఆమె కోరారు. రూ.100 వద్దని జైజయంత్ చెప్పినప్పటికీ ఆమె వినలేదు. పట్టుబట్టు మరీ డబ్బు ఇచ్చి వెళ్లింది. ఈ ఘటన తన దృష్టికి రావడంతో ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘వికసిత్ భారత్' కోసం కృషి చేసేలా 'నారీ శక్తి' ఆశీర్వాదం తనకు స్ఫూర్తినిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఆప్యాయత నన్ను కదిలిస్తోంది. నన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్న నారీ శక్తికి నమస్కరిస్తున్నానని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.