Current Date: 28 Nov, 2024

ఆర్టీసీ బస్‌లోకి 100 మంది.. బస్సు నడపనని వెళ్లిపోయిన డ్రైవర్!

తెలంగాణలో ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ డ్రైవర్లకి కొత్త తిప్పలు వస్తున్నాయి. ఒక బస్సులో 42 మంది కూర్చోవాల్సి ఉండగా 60 నుంచి 70 మందికి ఎక్కించుకొని మరీ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఇలా చేయడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ గతంలో కొండగట్టులో జరిగిన ఘటన.సిరిసిల్ల నుండి వరంగల్ కు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు హుజురాబాద్‌కు చేరుకుంది  కొంతమంది ప్రయాణికులు దిగిపోవడంతో అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తున్నచాలా మంది బస్సులోకి ఎగబడ్డారు. అప్పటికే బస్ ఫుల్ అయిపోయిందని డ్రైవర్ చెప్తున్నా వినకుండా దాదాపు 100 మందికిపైగా బస్సు ఎక్కేశారు.  ప్రమాదమని డ్రైవర్ చెప్తున్నా.. దిగేందుకు ప్రయాణికులు నిరాకరించారు.దాంతో చేసేదేం లేక.. బస్సును మెల్లిగా వరంగల్ వైపు నడిపిన డ్రైవర్.. పరిస్థితి అదుపు తప్పేలా ఉందని గ్రహించి రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో ఉండే సైడ్ మిర్రర్స్ కి ప్రయాణికులు అడ్డంగా ఉండటంతో వచ్చే పోయే వాహనాలు కనబడకుండా ఉండిపోయిందని.. పక్కకి జరగమని చెప్పినా ప్రయాణికులు వినకపోవడంతో  బస్సునే పక్కన పెట్టేసినట్లు డ్రైవర్ చెప్పుకొచ్చాడు.

Share