తెలుగులో 'దేవర', 'పెద్ది' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన జాన్వీకపూర్.. ఊహించని విధంగా ట్రోలింగ్‌కు గురైంది. దాంతో తెలుగు నుంచి ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు ప్లాన్స్ వేసుకుంటోంది. తెలుగు చిత్రసీమలో నటన కంటే తన గ్లామర్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జాన్వీ కపూర్.. తమిళంలో ఒక వినూత్న ప్రాజెక్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు సర్గుణం తెరకెక్కించనున్న ఒక క్రేజీ వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్ర పోషించనుందని కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో 'కలవాణి', 'వాగై చుడవా' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలను, ఇటీవల 'ఎగ్జామ్' అనే వెబ్ సిరీస్‌ను రూపొందించిన సర్గుణం.. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సిరీస్‌కు 'కురత్తి' అనే పవర్ఫుల్ టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నటించేందుకు జాన్వీ కపూర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
Share