కాకినాడ జిల్లా
పెద్దాపురం పట్టణంలోని గోలివారివీధికి చెందిన 106 ఏళ్ల శతాధిక వృద్ధురాలు గోలి మంగాయమ్మ ఆదివారం వృద్ధాప్యంతో కన్నుమూశారు. రెండు నెలల క్రితం వ రకు కళ్లజోడు లేకుండా పత్రికలు చదువుతూ, పనులు చేసుకునేవారు. ఆదివారం భోజనం అనంతరం అస్వస్థతతో తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలతో పాటు పెద్ద కుటుంబం ఉంది. మంగాయమ్మ మరణ వార్త తెలిసి స్థానిక ప్రముఖులు, బంధువులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆమె దీర్ఘాయుష్షు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం పలువురికి ఆదర్శంగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.