సీనియర్ కమెడియన్ అలీ రాజకీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. టాలీవుడ్‌లో సుదీర్ఘకాలం బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగిన అలీ.. వైసీపీలో చాలాకాలం ఉన్నా అతనికి తగిన గుర్తింపు రాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి అలీ భంగపడ్డాడు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించడంతో టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో రెండింటికీ చెడ్డ రేవడిలా అలీ ఉండపోయాడు.నిజానికి అలీ రాజకీయ ఆరంగేట్రం చిత్రంగా జరిగింది. దివంగత ప్రొడ్యూసర్ రామానాయుడు అప్పట్లో బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తూ నువ్వు కూడా రావాలి రా అనడంతో గురువు కోసం ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో టీడీపీ ఆ తర్వాత వైసీపీలో చేరాడు. అయితే ఇకపై రాజకీయాల్లో ఉండనని అలీ స్పష్టం చేశాడు.నేను ఏ పార్టీలో వున్నా వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఏ పార్టీ సపోర్ట్ ని కాదు. ఓ సామాన్యుడిని మాత్రమే. ఇక నుండి నా సినిమాలు, షూటింగులు చేసుకుంటాను. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఓ కామన్ మ్యాన్ గా వెళ్లి ఓటు వేసి వస్తా” ఇక రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.