Current Date: 08 Oct, 2024

పవన్‌‌ను ఫుట్‌బాల్‌తో పోల్చిన ప్రకాశ్ రాజ్ రచ్చ కంటిన్యూ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,  విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. వైసీపీ ప్ర‌భుత్వం త‌ప్పు చేసినందుకు తాను ప్రాయ‌శ్చిత్తం చేస్తానంటూ కాషాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ప‌వ‌న్ దీక్ష చేప‌ట్ట‌డంతో మొదలైన రచ్చ రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది.జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ప‌వ‌న్‌ను ట్విట్టర్‌లో వరుస ప్ర‌శ్న‌ల‌తో ప్రకాశ్ రాజ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తాజాగా త‌మిళ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్‌పై ప్ర‌కాశ్‌రాజ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్‌పై ప‌వ‌న్ తిరుప‌తిలో ఘాటు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.“ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫుట్‌బాల్ లాంటి వ్య‌క్తి. మైదానంలో ఫుట్‌బాల్‌ని త‌న్నిన‌ట్టుగా ఎవ‌రైనా తంతారు. సిగ్గూ శ‌రం లేని వ్య‌క్తి. ఒక అవ‌కాశ‌వాది. దేశంలో హిందూ ధ‌ర్మానికి, స‌నాత‌న ధ‌ర్మానికి ఎక్క‌డా ప్ర‌మాదం పొంచి లేదు. బీజేపీ మాత్రమే పొంచి వుంద‌ని చెబుతోంది. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ తెలుసుకుంటే మంచిది” అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు

Share