Current Date: 31 Jul, 2026

రహానే రిటైర్మెంట్.. ఎమోషనల్ వీడియో

టీమ్ఇండియా క్రికెటర్ అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ‘జీవితంలో ప్రతి పనికీ ఆరంభం, ముగింపు ఉంటుంది. ఇవాళ నేను ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. దేశం కోసం ఆడటం నా అదృష్టం. 20 ఏళ్లుగా నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు. కాగా రహానే 3 ఫార్మాట్లలో 8వేలకు పైగా పరుగులు చేశారు.