Current Date: 16 Jun, 2026

ఎరక్క పోయి వచ్చి ఇరుక్కు పోయారు

పర్యావరణాన్ని కాపాడేందుకు డేటా సెంటర్ లను వ్యతిరేకిస్తూ విశాఖ లో చేపట్టిన నిరసన కార్యక్రమం విశాఖ సీపీ  శంకభత్ర  భాగ్చి ని ఇరుకున పడేసింది. ఆదివారం విశాఖ బీచ్ లో డేటా సెంటర్ లను వ్యతిరేకిస్తూ ఒక సంస్థ ప్రజల మద్దతు ను కోరుతూ ఒక కార్యక్రమం చేపట్టింది. సంతకాల సేకరణ ను కూడా చేసింది . అయితే  బీచ్ లోనే జరిగిన వేరే  కార్యక్రమం లో పాల్గొని తిరిగి వస్తున్న సీపీ బాగ్చి ని నిరసన కారులు తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు . వీళ్ళు పర్యావరణాన్ని  కాపాడాలని కోరుతున్నట్టుగా బాగ్చి భావించి వాళ్ల ఛానల్ కు వాయిస్ ఇచ్చారు.  పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత అని, ఇందుకోసం తమ పోలీస్ శాఖ మొత్తం దీనికి సపోర్ట్ చేస్తుందని చెప్పేశారు. అయితే పర్యావరణ ప్రేమికులు పర్యావరణాన్ని  కాపాడడానికి డేటా సెంటర్ ల ఏర్పాటు ను వ్యతిరేకించాలని చేస్తున్న ఉద్యమానికి సీపీ బాగ్చి మద్దతు ఇస్తున్నట్టుగానే అందరికీ అర్ధం అయ్యింది. పైగా డేటా సెంటర్ లను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మీద సీపీ బాగ్చి సంతకం కూడా చేశారు. దీంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అదానీ డేటా సెంటర్ ల ఏర్పాటు ను  సీపీ బాగ్చి వ్యతిరేకిస్తున్నట్టు, ఆందోళన కారులకు మద్దతు ఇస్తున్నట్టు  అందరూ అర్ధం చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని ఎదురు చూసే లోపలే   సీపీ బాగ్చి మాటల్ని వక్రీకరించారని  సీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది  .