Current Date: 06 Mar, 2026

విజయ్‌-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్‌కి భారీగా హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు!

టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం అత్యంత వైభవంగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి నాగార్జున-అమల దంపతులు, నాగచైతన్య, రామ్‌చరణ్‌-ఉపాసన జంట, హీరో కార్తీ, రాధికా-శరత్‌కుమార్‌ దంపతులు హాజరయ్యారు. అలాగే నమ్రత శిరోద్కర్ తన కూతురు సితారతో కలిసి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ తారల రాకతో రిసెప్షన్ వేదిక మెరిసిపోయింది. కేవలం సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి అగ్రనేతలు విచ్చేసి విజయ్-రష్మిక జోడీకి శుభాకాంక్షలు తెలిపారు. అటు సినీ గ్లామర్, ఇటు రాజకీయ హంగులతో హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ రిసెప్షన్ వేడుక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక కనులపండువగా జరిగింది.