Current Date: 19 Aug, 2026

హోమ్ మంత్రి ఇలాకాలో అక్రమ గ్రావెల్ దందా

హోమ్ మంత్రి అనిత ఇలాకాలో అక్రమ గ్రావెల్ దందా బయటపడింది. మంగళవారం అర్థరాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారం తో నక్కపల్లి  పోలీసులు మూడు లారీల అక్రమ గ్రావెల్ ను పట్టుకున్నారు. తునికి చెందిన టీడీపీ నాయకుడి ప్రైవేటు లేఔట్  కోసం   ఈ అక్రమ గ్రావెల్  ను తరలిస్తున్నట్టు తెలిసింది. నక్కపల్లి లో పోలీసులు మూడు అక్రమ గ్రావెల్ లారీలను పట్టుకున్న విషయం తెలుసున్న   అక్రమార్కులు రెండు లారీల గ్రావెల్ ను రోడ్డు మీద,మరో  అయిదు లారీల గ్రావెల్ ను తోలు గేట్ దగ్గర లోని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు.పాయకరావుపేట పంచదార ఫ్యాక్టరీ  దగ్గరి పోలవరం  కాలువ  నుంచి  ఈ గ్రావిల్ ని తవ్వుకొని వెళ్లిపోతున్నట్టు స్థానికులు కనుగొన్నారు. ఇప్పటివరకూ 500 లారీల గ్రావెల్ ని ఇక్కడి నుంచి అక్రమంగా తరలించినట్టు అంచనా.  తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనీడి సోమరాజు (అబ్బాయి ),  పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గుల్లిపాడు రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ప్లాట్ పారం ఎత్తు చేయడానికి కూడా 8 వేల లారీల గ్రావెల్ ను పోలవరం కాలువ నుంచే  అక్రమంగా తవ్వేసి తరలించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం లో కొప్పిశెట్టి వెంకటేష్,  పి ఏ సి యస్ అధ్యక్షుడు దార్ల కృష్ణ  కీలక పాత్ర పోషించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. హోమ్ మంత్రి అనిత పేరు చెప్పి  వీళ్ళు  ఈ గ్రావెల్ దందాను  యాదేచ్ఛగా జరిపినట్టు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.  ఈ గ్రావెల్ దందా పై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.