Current Date: 31 Jul, 2026

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక "బ్రేక్".

గత రెండు రోజులుగా గోదావరి కి వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయకముందే బోట్ల యజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్న ఇప్పటివరకు గోదావరి కి వరదలు సంభవించకపోవడంతో ఇప్పటివరకు పాపికొండల విహారయాత్రలు సజావుగా సాగాయి. అయితే గత సోమవారం రాత్రి నుండి మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరికి వరద తాకిడి తాకింది. గంట గంటకు వరద నీరు పెరుగుతుండడంతో తెలంగాణ భద్రాచలంలో ఇప్పటికే పదవ నెంబరు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని పడవల యాజమాన్యం గత రెండు రోజులుగా పాపికొండలు విహార యాత్రను నిలిపివేసి ముందు చూపుగా నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.