Current Date: 29 Nov, 2024

సుబ్బరాజు వైఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా..

ఖడ్గం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న యాక్టర్ పెనుమత్స సుబ్బరాజు సంతోష్‌ అలియాస్ సుబ్బరాజు. 47 ఏళ్ళు వచ్చిన ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఆసక్తి లేదని చెప్పే ఆయన సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. దీంతో సుబ్బరాజు భార్య ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటని ఆరాలు తీస్తున్నారు. సుబ్బరాజు భార్య పేరు స్రవంతి. స్రవంతి అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్లో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీల నుండి ఆమె బిడియస్, రిడియస్, యమ్ పి హెచ్ డిగ్రీలు పొందారు. స్రవంతి ఫిట్నెస్ ఫ్రీక్. ఆమెకి సైన్స్ అంటే విపరీతమైన ఆసక్తి. చాలా ఏళ్ల క్రితం స్రవంతి ఫ్యామిలీ అమెరికాలో ఫ్లోరిడాలో స్థిరపడింది. ఇక ఆడంబరాలకు దూరంగా ఉండే సుబ్బరాజు తన వివాహాన్ని చాలా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి అమెరికాలో చేసుకున్నప్పటికీ త్వరలోనే హైదరాబాద్ లో రిసెప్షన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Share