Current Date: 20 Aug, 2026

విశాఖ జూపార్కు వద్ద లారీని ఢీకొట్టిన పోలీస్ వ్యాన్ ...

ఆగి ఉన్న లారీని పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న సంఘటన విశాఖలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో సుమారు కొంతమంది సిబ్బందికి గాయాలు కాగా వారందర్నీ స్థానిక ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది టర్న్ డ్యూటీ మేరకు వీరంతా వాహనంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాహన డ్రైవర్ కు కాళ్ళు విరిగిపోగా, ఒక ఆర్ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు చిన్న చిన్న గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.