మెగా ఫ్యామిలీపై విమర్శలు చేయడంలో ముందుండే రాంగోపాల్‌వర్మ.. ఎట్టకేలకి తొలిసారి మెగాస్టార్ చిరంజీవి గురించి సాప్ట్‌గా మాట్లాడుతూ క్షమాపణలు కూడా చెప్పాడు. దాంతో కొన్నేళ్ల క్రితం జరిగిన గొడవకి పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టినట్లు అయ్యింది. నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో 36 ఏళ్ల క్రితం వచ్చిన శివ సినిమా నవంబర్ 14న రీ-రిలీజ్‌కాబోతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆల్ ద బెస్ట్ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. రామ్‌గోపాల్ వర్మ.. విజన్, కెమెరా యాంగిల్స్, లైట్స్, సౌండ్ ప్రజెంటేషన్.. అన్నీ కొత్తగా వావ్ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే అనుకున్నాను. హ్యాట్సాఫ్ రామ్‌గోపాల్ వర్మ అని చిరంజీవి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Share