రైటర్స్ అకాడమీ మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా కన్యాశుల్కం సంక్షిప్త నాటకం ప్రదర్శించడం అభినందనీయమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. నాటకాన్ని తిలకించిన అనంతరం నటీనటుల పరిచయ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రైటర్స్ అకాడమీ తరుపున మంచి ప్రదర్శన చేశారన్నారు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకానికి అందరూ అభిమానులే అన్నారు. కలకాలం ఉండే నాటకం కన్యాశుల్కం అని, ఆనాటి పరిస్థితులకే కాక, నేటి పరిస్థితులకు కూడా కన్యాశుల్కం అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. నటీ నటులకు ఆ కాలం నాటి పరిస్థితులకనుగుణంగా క్యారెక్టర్లకు తగ్గట్టు చక్కటి మేకప్ చేశారని కొనియాడారు. రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ సంపాదకులు వీవీ రమణమూర్తి ఇందులో నటిస్తున్నారని తనకు తెలియదని, నాటకంలో ఆయనను చూసి నటనకు మంత్రముగ్ధుడినయ్యానన్నారు.
Share