ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. ఆయనతో పాటు IAS అర్వింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి కూడా అటెండ్ అయ్యారు. కేటీఆర్ రాక సందర్భంగా కోర్టు వద్దకు BRS కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ-ఫార్ములా నిర్వహణ వల్ల రూ.55 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ వాదిస్తోంది.