Current Date: 29 Nov, 2024

గిరిజన ఆశ్రమ పాఠశాల అదనపు వసతి గదులు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి..

సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం ఎంపీడీవో కార్యాలయం పక్కన గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి అదనపు గదులను గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. కోటి 75 లక్షల రూపాయలతో వసతి అదనపు గదులు ప్రారంభించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ..  కావలసిన మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం లో ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులందరూ ఉన్నత విద్యావంతులు అవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్ బాబు పార్టీ కార్యదర్శి గూడెపు యుగంధర్, పార్టీ నాయకులు ముఖియ సూర్యనారాయణ, కోరిపల్లి సురేష్ , పార్టీ నాయకులు సర్పంచులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Share