విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (SMS-1) వరుస ప్రమాదాలకు వేదికగా మారుతోంది. జూన్ 8న సంభవించిన భారీ పేలుడులో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదాని ముందు.. ఆ తర్వాత కూడా అనేక ప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భద్రతా ప్రమాణాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.జూన్ 4- ఎస్ఎమ్ఎస్-1 వద్ద రొటీన్ ప్రక్రియలో భాగంగా ద్రవ ఉక్కు ప్లాట్‌ఫారమ్‌పైకి పొంగిపొర్లింది. సురక్షిత ప్లాట్‌ఫారమ్ వల్ల ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఇది ముందస్తు ప్రమాద హెచ్చరికగా మారింది.జూన్ 8: ఎస్ఎమ్ఎస్-1 విభాగంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 10 మంది ఉద్యోగులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దీనిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవ్వడంతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని వేసింది.జూన్ 11: రీన్సింగ్ ప్రక్రియ జరుగుతుండగా మళ్లీ ద్రవ ఉక్కు, వ్యర్థాలు (స్లాగ్) ఒక్కసారిగా ఎగసిపడి మంటలు చెలరేగాయి.ఆగస్టు 22: నిబంధనలకు విరుద్ధంగా రిజెక్టెడ్ మెటీరియల్‌ను వాడటం వల్ల ఎస్ఎమ్ఎస్-1 విభాగంలో మరోసారి ప్రమాదకర పరిస్థితి తలెత్తింది.నాణ్యతా లోపాలు - పెను అనుమానాలువిశాఖ స్టీల్ ప్లాంట్‌లో వినియోగిస్తున్న ‘సిలికో-మాంగనీస్’ వంటి ఫెర్రో-ఎల్లాయ్స్ నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతా పరీక్షల్లో తిరస్కరించిన మెటీరియల్‌ను ఎవరు అనుమతించారు? మోతాదుకు మించి తేమ ఉండటం వల్లే ఈ పేలుళ్లు జరుగుతున్నాయా? సరఫరాదారుల లాభాల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.