Current Date: 29 Nov, 2024

తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్‌ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారి కర్ణసాగర్ తెలిపారు. ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి ఉత్తర ఈశాన్యదిశగా 270, నాగపట్టణానికి తూర్పుగా 300, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. వాయువ్య దిశగా కదిలి.. బలపడి రానున్న 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా పయనించి నవంబర్ 30న మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి దగ్గర, కారైకాల్ - మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు. 

Share