స్కిల్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సీఐడీ తరఫున నేరుగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరారు. దీంతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని గతంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.