Current Date: 19 Aug, 2026

యూట్యూబ్ లో కీలక మార్పు

గూగుల్ కు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వ్యూస్ లెక్కించే విధానంలో కీలక మార్పు తీసుకురాబోతోంది. వీడియో ప్రారంభమైన తొలి ఫ్రేమ్ నుంచే ఇకపై వీడియో వ్యూ కౌంట్ ప్రారంభవుతుంది. అన్ని ఫార్మాట్లకు వ్యూస్ లెక్కింపు విధానంలో ఏకరూపత ఉండాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేపడుతోంది. ఆగస్టు 24 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి రానుంది.