Current Date: 29 Nov, 2024

జగన్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే.. షర్మిల ఎద్దేవా...

అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి  ఎద్దేవా చేశారు.  జగన్ వ్యాఖ్యలపై పలు ప్రశ్నలు సంధించారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, తమరు రూ.2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా అంటూ వ్యాఖ్యలు చేశారు. మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా? ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.

Share