Current Date: 31 Jul, 2026

వలలో పులస పడింది..

పుస్తులమ్ముకొనైనా పులస తినాలానే నానుడి వుంది. ఆ రోజు రానే వచ్చేసింది. అంటే పుస్తులమ్ముకొనే రోజు కాదు... పులస చేప రుచి గురించి చెప్పడానికి మాత్రమే ఈ నానుడి వచ్చింది. ఇక విషయానికి వచ్చేద్దాం .గోదావరి కి వరద తాకిడి రావడం తో  గౌతమీ గోదావరి లో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది.  ఈ పులస కోసమే ఎదురు చూస్తున్న  మత్స్యకార మహిళ   పొన్నమండ రత్నం మారు మాట్లాడకుండా 15 వేల రూపాయలకు ఈ చేపను కొనేసి ఆనందం తో ఉప్పొంగి పోయింది.