Current Date: 24 Feb, 2026

మరో 3రోజుల్లో విజయ్- రష్మిక పెళ్లి.. మార్చి 4న రిసెప్షన్

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, తాము త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఈ జంట అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే విరోష్ అనే పేరునే తమ వివాహ వేడుకకు 'వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని నామకరణం చేసి, ఫ్యాన్స్‌ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఫిబ్రవరి 26న అత్యంత ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యులు, న్నిహితుల మధ్య జరగనుంది. ఈ వేడుక కోసం అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా నియమించినట్లు సమాచారం. అనంతరం మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో సినీ, రాజకీయ రంగాల ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 2025లోనే వీరి నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు మూడుముళ్లతో ఒకటయ్యేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ఈ క్రేజీ కపుల్ మళ్లీ 'రణబలి' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో కలిసి నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. పెళ్లి పనుల బిజీలో ఉన్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్స్ కూడా సజావుగా సాగేలా వీరు ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ వెడ్డింగ్‌గా నిలిచిన ఈ వేడుక కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.