తెలుగు బుల్లితెర యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమనేని మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీజు రూ.399 వసూలు చేస్తూ గ్లామరస్ కంటెంట్ పోస్ట్ చేస్తోందనే విమర్శలు, పోలీస్ కేసుల వివాదం మరువక ముందే ఆమె సరికొత్త వివాదానికి తెరలేపారు. ఆ వివాదం తర్వాత ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య అమాంతం పెరగగా.. తాజాగా పెయిడ్ సబ్స్క్రైబర్లతో నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో విష్ణుప్రియ చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ లైవ్ సెషన్లో ఓ సబ్‌స్క్రైబర్ అడిగిన ప్రశ్నకు విష్ణుప్రియ బదులిస్తూ.. తన 'బాడీ కౌంట్' ఐదు అని బహిరంగంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ తరహా వ్యాఖ్యలు సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తాయంటూ పలువురు ప్రశ్నిస్తుండగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేస్తూ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఇది ఆమె వ్యక్తిగత విషయమని, అంత ఓపెన్‌గా మాట్లాడటంలో తప్పులేదంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.