Current Date: 31 Jul, 2026

జపాన్‌లో భారీ భూకంపం.. 18 మంది మృతి

జపాన్‌లో తాజాగా 7.1 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం  ధాటికి ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. మరో 62 మంది గాయపడగా వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కూలిపోయిన షాపింగ్ మాల్స్, ఇళ్లలో పెద్దసంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు.