Current Date: 16 Jun, 2026

బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ 10 కోట్ల రూపాయల విరాళం...

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ బద్రీనాథ్ క్షేత్రానికి భారీ విరాళం ప్రకటించారు. సోమవారం ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు . లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. బద్రీనాథ్ - కేదార్‌నాథ్ ఆలయాల అభివృద్ధి, భక్తులకు మౌలిక వసతుల కల్పన కోసం రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేశారు . హెలికాప్టర్‌లో బద్రీనాథ్ ధామ్‌కు చేరుకున్న ముఖేశ్ అంబానీకి బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన బద్రీ విశాల్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కేదార్‌నాథ్ క్షేత్రాన్ని కూడా సందర్శించి ప్రార్థనలు చేశారు